![]() |
![]() |
.webp)
ఒకప్పుడు లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో జగపతి బాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జగపతి బాబు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క సినిమా "శుభలగ్నం". ఆయన కెరీర్ ని మార్చేసిన మూవీ. అలాంటి జగపతి బాబు ఇప్పుడు బుల్లితెర మీద కనిపించబోతున్నారు. "జయమ్ము నిశ్చయమ్మురా" అనే ఒక కొత్త టాక్ షో ద్వారా హోస్ట్ గా రాబోతున్నారు.."జ్ఞాపకం దాని విలువ ఒక జీవితం..అన్నీ నేరుగా చెప్పుకోలేక అమ్మకు రాసిన ఉత్తరం. నాన్న కంట పడకుండా గడిపిన బాల్యం. ఆట కోసమే బతికిన రోజులు..అమ్మా నాన్న కోసమే చదువుకున్న క్షణాలు..అలవాటుగా మారిన అల్లరి పనులు..అన్నీ ఉన్నా కూడా చేసిన చిన్ని చిన్ని దొంగతనాలు.
అలలా కదిలిపోయిన యవ్వనం..కళ్ళ ముందే మారిపోయిన కాలం..వీటన్నిటికీ ఒక్కటే లక్ష్యం..విజయం..జయమ్ము నిశ్చయమ్మురా" అంటూ ఒక ప్రోమో రిలీజ్ అయ్యింది. "గుర్తుల్ని జ్ఞాపకాలుగా మార్చుకుని మనసుల్ని గెలుచుకున్న మన మనుషుల కథలు..వింటారా.. విత్ మీ మీ జగపతి..అంటూ ఒక టాక్ షోతో త్వరలో జీ తెలుగులో రాబోతున్నారు. ఇక గోడ మీద సెలబ్రిటీస్ పిక్స్ కూడా కనిపించాయి. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రాఘవేంద్ర రావు, దిల్ రాజు, కీర్తి సురేష్, సుకుమార్, మహేష్ బాబు వంటి ఎంతో మంది సెలబ్రిటీస్ చిత్రాలు ఉన్నాయి. ఇక డ్రామా జూనియర్స్ సీజన్ 8 స్టార్ట్ ఐనప్పుడు జగపతి బాబు, రోజు, ఆమని వచ్చి కాసేపు సందడి చేసారు.
![]() |
![]() |